కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

posted on: Feb 24, 2026 9:41AM

ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురూ మరణించారు.  రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి  రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.

తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన  20 నిమిషాల తర్వాత,  ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దారి మళ్లించాలని  పైలట్ కోరారు. ఆ తరువాత క్షణాల వ్యవధితోనే విమానంతో  కుప్పకూలింది.  ఈ దుర్ఘటనలో  విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, ఒక డాక్టర్,  పారామెడిక్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం ఏడుగురూ మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్  తెలిపారు.   ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో   బృందాన్ని ఘటనాస్థలానికి చేరుకుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...