TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్‌బాడీ గుర్తింపు

Published on: Sun Jun 15, 2025 1:43PM

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తించినట్లు  ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఆయన డీఎన్‌ఏతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందని తెలిపారు. రూపానీ స్వస్థలం రాజ్‌కోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఒక్కో డీఎన్‌ఎ పరీక్షకు 26 నుంచి 40 గంటల సమయం పడుతుందని డాక్టార్లు తెలిపారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 31 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్టు సివిల్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. 

వీరిలో 12 మంది మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాయి. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) కు చెందిన ఫోరెన్సిక్ బృందాలు ఈ బృహత్తర గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఊరట కలిగించేందుకు ఈ బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.