Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు విశ్వాస్ కీలక ప్రకటన
posted on: Jun 13, 2025 2:50PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ కీలక ప్రకటన సమాచారం వెల్లడించారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన వెల్లడించారు. నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదని అని విశ్వాస్ కుమార్ వెల్లడించారు. చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడారు. విమాన భాగం విడిపోయి మెడికోల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది.
ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు రాగానే మంటలు అంటుకున్నాయి. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాని ఆయన తెలిపారు. ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరిలించారు అని మీడియాతో తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌కుమార్.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు.






