TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్

Published on: Thu Jun 12, 2025 8:32PM

 

అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం టాటా గ్రూప్ ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నాది. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రకటించింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మృతిచెందారు. 

ఈ ఘటన మొత్తం దేశాన్ని కలిచివేసింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.