TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెడికల్ కాలేజీపై కూలిన విమానం..20 మంది మెడికోలు మృతి

Published on: Thu Jun 12, 2025 4:14PM

 

అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. దీంతో  20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాలకే విమానం కూలింది. దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం  భోజన సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు చెబుతున్నారు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది. 

18005691444 నెంబర్ను క్షతగాత్రుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి 'మేడే కాల్' జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే 'మేడే కాల్' అంటారు. అయితే, ఈ 'మేడే కాల్'కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ పేర్కొనడం గమనార్హం.