TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Published on: Thu Jun 12, 2025 3:50PM

 

అహ్మదాబాద్‌‌ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 

ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ బయల్థేరారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేపట్టనున్నారు.  ఘ‌ట‌న‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌మాదం గురించి పోస్టు చేసింది. ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్ల‌డించింది.  విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల్లోనే పైల‌ట్‌లు ఇద్ద‌రు ఏటీసీకి ఎమ‌ర్జెన్సీ కాల్ చేశారు. ఆ త‌ర్వాత ఎలాంటి మాట‌లు వినిపించ‌లేద‌ని, నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌ట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశస్థులు, 1 కెనడియన్ మరియు 7 మంది పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది.