TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అహ్మదాబాద్‌ కూలిన విమానంలో మాజీ సీఎం

Published on: Thu Jun 12, 2025 2:58PM

 

అహ్మదాబాద్‌‌లో కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రూపానీకి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తున్నారు.

కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్ గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టు సమాచారం. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.