TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అహ్మదాబాద్ లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం

Published on: Thu Jun 12, 2025 2:51PM

అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. ఈ విమానం జనావాసాలపై కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. విమానంలో ప్రయాణీకుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. అయితే కొందరికి ఆస్పత్రికి తరలిం చినట్లు చెబుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కొద్ది సేపటికే కూలిపోయిందని చెబుతున్నారు.

విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇలా ఉండగా విమానంలో గుజరాత్  మాజీ సీఎం  విజయ్ రూపాణి ఈ విమానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.  ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.