అగస్టా దర్యాప్తులో సీబీఐ వేగవంతం.. విచారణలో త్యాగి
Published on: Mon May 2, 2016 10:46AM
.jpg)
అగస్టా స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు సీబీఐ త్యాగిని విచారిస్తుంది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.


