అగ్రిగోల్డ్ బాధితులు హైకోర్ట్ భరోసా.. ఆ బాధ్యత మాదే..
Published on: Mon Nov 16, 2015 10:28AM

అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందవద్దని.. బాధితులకు డబ్బు చెల్లించే బాధ్యత మాది అని హైకోర్టు తెలిపింది. హైకోర్టు నియమించిన కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని.. అగ్రిగోల్ట్ ఆస్తులను వెలికి తీస్తామని సూచించింది. అంతేకాదు రూ 570. కోట్లు డిపాజిట్లు, రెండున్నర కేజీల బంగారం, రూ 7.5 లక్షల నగదు వెంటనే హైకోర్టు అకౌంట్ లో జమ చేయాలని తెలిపింది. విచారణ ఎంత వరకూ వచ్చిందో నివేదిక ఇవ్వాలని హైకోర్టు, సీఐడీని ఆదేశించింది. కాగా తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.


