TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల లడ్డూ ప్రసాదంలోనే కాదు.. ఆ దేవాలయాల ప్రసాదాల్లోనూ కల్తి నెయ్యి వినియోగం?!

Published on: Fri Jun 20, 2025 10:22AM

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి  నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది. అంతే కాకుండా  బోలేబాబా డెయిరీ.. తిరుపతి నగరంలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.  

తిరుపతిలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని బోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలకూ సరఫరా చేసినట్లు సిట్ ఆధికారులు గుర్తించారు. పేరుకు తిరుపతిలోని ఓ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా అయినప్పటికీ పరోక్షంగా బోలేబాబా డెయినీ సంస్థే ఆ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారల దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నట్లు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలోనే కల్తీ నెయ్యి వినియోగం జరగలేదనీ, రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదం తయారీలోనూ కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు తేలింది.