కొండాసురేఖపై పరువు నష్టం దావా కేసు 10కి వాయిదా
posted on: Oct 8, 2024 5:12PM
తన కుటుంబంపై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన సినీహీరో నాగార్జున స్టేట్ మెంట్ ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 10 వ తేదీకి వాయిదా పడింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును అభ్యర్థించారు. మొదటి సాక్షిగా నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డ్ చేసింది. నాగార్జునను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.



.webp)
.webp)





