Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెరాస నేతపై శ్రీ రెడ్డి లైంగిక ఆరోపణలు
posted on: Oct 15, 2018 1:47PM

కాస్టింగ్ కౌచ్‌పై ఆరోణలతో వార్తల్లోకి ఎక్కిన శ్రీ రెడ్డి టాలీవుడ్ లో పెను దుమారం రేపింది.పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసింది.తనకు అన్యాయం జరిగిందంటూ నడి రోడ్డుపై అర్ధ నగ్నంగా నిరసన కూడా తెలిపింది.గత కొన్ని రోజులుగా కనపడని శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నై లో ఉంటుంది.తాజాగా భారత్ లో మీ టూ ఉదయం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మళ్ళీ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తెరాస నేత,ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవన్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని శ్రీ రెడ్డి ఆరోపించింది.అంతేకాక నిర్మాత బెల్లంకొండపై కూడా శ్రీ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించింది.
ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ రెడ్డి.. 'జీవన్ రెడ్డి హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో నాపై వేధింపులకు పాల్పడ్డాడు.అతడికి అమ్మాయిలంటే పిచ్చి.అతడు పెద్ద మోసగాడు.అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తమ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులకు దిగేవాడ’ని పేర్కొంది.కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న జీవన్ రెడ్డిపై శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలతో తెరాస పార్టీ సందిగ్ధంలో పడింది.తెరాస పార్టీ తరుపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, ఆర్మూర్ ప్రజల్లో అంశం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతి పక్ష పార్టీలకు శ్రీ రెడ్డి వ్యాఖ్యలు ఊతంగా నిలుస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలపై జీవన్ రెడ్డి గాని,తెరాస పార్టీ గాని ఇంతవరకు స్పందించలేదు.






