స్నేహ తల్లి కాబోతోందట

Publish Date:Apr 14, 2015

 

అందాల స్నేహ ఇప్పుడు అమ్మ కాబోతోంది. ఏ వయసుకి ఆ ముచ్చట జరగాలన్నట్టుగా సరైన సమయంలో తన సహనటుడు ప్రసన్నని పెళ్ళి చేసుకుంది. స్నేహ వైవాహిక జీవితం చాలా హ్యాపీగా వుంది.. పెళ్ళయిన తర్వాత నటించడానికి కూడా ఆమె భర్త నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేకపోవడంతో స్నేహ ఎంచక్కా మంచి మంచి పాత్రలు ధరిస్తూ తనలోని నటిని సంతృప్తి పరుస్తున్నారు. మొన్నీమధ్యే విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఒక మంచి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఆమె జీవితంలో మరో అద్భుతం జరగబోతోంది... ఎస్... స్నేహ తల్లి కాబోతోంది.. ఈ విషయాన్ని ఈ జంటే కన్ఫమ్ చేశారు. ‘‘మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం’’ అని ట్విట్టర్లో సగర్వంగా పోస్ట్ చేసి ఈ శుభవార్తని అందరితో పంచుకున్నారు. ‘మా ఫ్యామిలీలో మూడో వ్యక్తిని చూడబోతున్నాం’ అని కూడా పేర్కొన్నారు. స్నేహ దంపతులకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పేద్దాం.

By
en-us Political News