Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రముఖ సినీనటి మంజుల కన్నుమూత
posted on: Jul 23, 2013 2:55PM

ప్రముఖ సినీనటి మంజుల ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మంజుల ప్రముఖ తమిళ నటుడు విజయకుమార్ సతీమణీ. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మంజుల కథానాయికగా తెలుగు,తమిళ్, కన్నడ లో దాదాపు వంద చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా 'వాసు'.
ఎన్టీ రామారావుతో మగాడు, మా ఇద్దరికథ, వాడే వీడు వంటి చిత్రాల్లో, కృష్ణతో మాయదారి మల్లిగాడువంటి చిత్రాల్లో, అక్కినేని నాగేశ్వర రావు సరసన బంగారు బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు సరసన ఆమె పలు చిత్రాల్లో నటించారు. శోభన్ బాబు, మంజుల అప్పట్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. తమిళంలో ఆమె శివాజీ గణేషన్, యంజీ రామచంద్రన్, జెమినీ గణేషన్ సరసన నటించింది.



.jpg)


