దియా మిర్జా పెళ్ళి మళ్ళీ వాయిదా!
posted on Jul 17, 2014 11:39AM

బాలీవుడ్ నటి, హైదరాబాద్ అందగత్తె దియా మిర్జా శుభమా అని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ వుంటూ ఆ పెళ్ళి వినాయకుడి పెళ్ళిలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వుంది. కొన్ని సినిమాల్లో నటించి, రీసెంట్‌గా ‘లవ్ బ్రేక్ అప్’, ‘జిందగీ’ సినిమాలను నిర్మించింది. లేటెస్ట్‌గా విద్యాబాలన్ హీరోయిన్‌గా ‘బాబీ జాసూస్’ సినిమాని నిర్మించింది. ఇదిలా వుంటే దియా మిర్జా గత కొన్నే్ళ్ళుగా సాహిల్ అనే కత్తిలాంటి కుర్రోడితో డేటింగ్ చేస్తోంది. ఎంతకాలం ఈ డేటింగ్.. ఎంచక్కా పెళ్ళి చేసుకుని సెటిలైపోవాలని గత సంవత్సరకాలంగా దియా మిర్జా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికి రెండు మూడుసార్లు వీళ్ళిద్దరి పెళ్ళి వాయిదా పడింది. తాజాగా దియా మిర్జా పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించేసరికి ఈసారి ఆమె నిర్మించిన ‘బాబీ జాసూస్’ సినిమా అడ్డం వచ్చిపడింది. చివరికి ఈసారి కూడా ఈ సినిమా విడుదలయ్యాక పెళ్ళి పీటల మీదకి ఎక్కాడని దియా డిసైడ్ చేసుకుంది.