డాక్టర్ పై మహిళ యాసిడ్ దాడి

posted on: Feb 7, 2019 11:17AM

 

ప్రేమించట్లేదనో లేక ప్రేమించి మోసం చేసిందనో.. అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ తోనో లేక కత్తితోనో దాడి చేయడం చూస్తుంటాం. అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అబ్బాయిలకు కూడా పరిచయం చేస్తున్నారు అమ్మాయిలు. తాజాగా ఒక మహిళ ఓ వ్యక్తిపై యాసిడ్ తో దాడి చేసి భయపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. విడాకుల కేసులో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి గురువారం నాడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అదే సమయంలో ఆదర్శ్ రెడ్డి వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ బురఖా వేసుకొని వచ్చి యాసిడ్‌తో దాడికి ప్రయత్నించింది. అయితే ఈ ఘటనలో  డాక్టర్ ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని డాక్టర్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...