కల్తీ పాల కేసులో నిందితుడికి రిమాండ్

posted on: Feb 24, 2026 9:08AM

రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించిన కల్తీ పాలు కేసులో పాల వ్యాపారి అడ్డాల గణేష్‌ను కోరుకొండ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్  చేశారు.  మహాశివరాత్రి సందర్భంగా ఒక క్యాన్‌లోని 40 లీటర్లు పాలు కల్తీ చేసినట్లు నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. కల్తీ పాల కారణంగా రాజమహేంద్రవరం చౌడేశ్వరనగర్,  స్వరూప్ నగర్ లకు చెందిన నలుగురు వ్యక్తులు ఇప్పటికే మృతి చెందారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.

వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి డెయిరీని నిర్వహిస్తున్న అడ్డాల గణేష్‌పై మర్డర్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి, రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...