ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం.. పలువురికి గాయాలు

 

హీరో నిఖిల్ హీరోగా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న  ది ఇండియా హౌస్ చిత్రం షూటింగ్ లో భారీ ప్రమాదం సంభవించింది.  ఈ సినిమా షూటింగ్‌ కోసం శంషాబాద్ సమీపంలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లో కీలకమైన సముద్రం సన్నివేశాలు చిత్రీకరించేందుకు స్విమ్మింగ్ పూల్ సెట్ వేశారు. అయితే సముద్రం ఎఫెక్ట్ రావడం కోసం భారీ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.

అయితే బుధవారం (జూన్ 11) ఈ భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో నీరు నిజంగానే సముద్రంలా మారి సెట్ ను ముంచేసింది. ఈ ప్రమాదంలో కెమెరాలు, ఇతర వస్తువులు మునిగిపోయాయి. అసిస్టెంట్ కెమేరామెన్ సహా పలువురు గాయపడ్డారు.  ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu