TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం.. తొమ్మిది మంది మ‌‌ృతి

Published on: Wed Oct 1, 2025 1:20AM

తమిళనాడులోఘోర విషాదం సంభవించింది. చెన్నై సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో మంగళవారం (సెప్టెంబర్ 30)పై కప్పు కుప్పకూలి తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తలరించారు.  ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.  మృతులంతా ఉత్తరాదికి చెందిన కార్మికులే.   ప్రస్తుతం క్షతగాత్రులకు చెన్నైలోని రాయపురం స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.  

ఎన్నూర్ పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ వ్యయంతో మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు.