TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు.. ఏబీవీ వ్యూహమేంటి?

Published on: Tue Jul 14, 2026 10:44AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ఒక  సంచలనం.  వైసీపీ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ వేధింపులు అన్నీఇన్నీ కావు. డిప్యూటీ జనరల్ ర్యాంక్ అధికారి అయిన ఏబీవీని 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల పాటు ఎలాంటి ప్రధాన పోస్టింగ్ ఇవ్వకుండా.. తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.  ఆయనను సర్వీస్ నుండి సస్పెండ్  చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఏబీవీ సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్  , హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు.

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ పొడిగించలేరని,  2022 ఏప్రిల్ 22న దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా హైకోర్టులో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను 2024 మే 31న న్యాయస్థానం కొట్టివేసింది. ఇలా ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఏబీవీ, సహజంగానే అప్పట్లో ఎన్డీయే కూటమికి నైతిక మద్దతుగా నిలిచారు.

అయితే, ఇటీవల రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏబీవీ..   చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలను, కొన్ని పోలీస్ చర్యలను ఏబీవీ బాహాటంగా విమర్శిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.   వేదికపై  వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఏబీవీ..  ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా  అన్న సందేహాలు కూడా వెల్లువెత్తాయి. 

అయితే తాను వైపీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారానని ఏబీ వెంటటేశ్వరరావు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు.  తనకు  వ్యక్తిగత నైతిక విలువలు, మర్యాదలు ఉన్నాయన్న ఆయన.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికపై అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటను కూడా తాను వినలేదన్న ఏబీవీ..  అంబటి రాంబాబు వేదికపైకి రాగానే  తాను వేదికపై నుంచి వెళ్లిపోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే కూర్చున్నానని వివరించిన ఏబీవీ..   వైసీపీ ప్రభుత్వం   అణచివేయాలని చూసిందని..  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా అదే తప్పులను పునరావృతం చేయకూడదనేదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. దీంతో ఏబీవీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో కొన్ని పాలనాపరమైన విబేధాలు ఉండొచ్చు కానీ,  ఆయన ఆ కారణంతో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏ మాత్రం లేవనీ, ఏబీవీ కుండబద్దలు కొట్టినట్లుచెప్పినట్లైంది.  

ABV IPS, Ambati Rambabu, AP Politics, NDA Government Criticism, YCP Ecosystem