కలాం మృతి.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
Published on: Mon Jul 27, 2015 10:08PM

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. కలాం మరణంతో భారతదేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను, దార్శికుడిని, స్ఫూర్తి ప్రదాతను కోల్పోయిందని అన్నారు. అబ్దుల్ కలాం మృతిపట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలాం మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.


