TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబ్దుల్ కలాం కన్నుమూత

Published on: Mon Jul 27, 2015 9:01PM

 

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో వున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అబ్దుల్ కలాం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఐఐఎంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆయన కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలి మరణించారు. అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా 2002 - 2007 మధ్యకాలంలో పనిచేశారు.