TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి

Published on: Sat Feb 8, 2025 11:52AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారం కోల్పోవడమే కాకుండా కీలక నేతలు కూడా ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ సంపూర్ణ ఆధిక్యత దిశగా దూసుకుపోతున్నది.

ఆమ్ ఆద్మీ పార్టీ తేరుకోలేని పరాభవాలను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. అలాగే జంగ్ పురా నియోజకవర్గం నుంచి ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. అలాగే జంగ్ పురా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్  విజయం సాధించారు.