విశ్వాసపరీక్షలో కేజ్రీవాల్ విజయం

posted on: Jan 2, 2014 6:23PM

 

Aam Aadmi Party wins trust vote, Delhi Assembly, Kejriwal government,Delhi govt updates

 

 

ఢిల్లీ శాసనసభలో ఆమాద్మీ పార్టీ తన బలం నిరూపించుకుంది. మొత్తం 70మంది ఉన్న అసెంబ్లీ లో 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు ఇవ్వడంతో ఆమాద్మీ విశ్వాస పరీక్ష నెగ్గింది.

 

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అమ్ఆద్మీపార్టీకి 28 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు 8 స్థానాలు వచ్చాయి. ఏఏపీకి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ జరుగుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆరు నెలల వరకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ ఆరు నెలల్లో ఏఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...