ప్రపంచంలోని అత్యంత విలువైన నాణెలలో ఆరు

ప్రపంచం డిజిటల్ మనీ, ఈ మనీ వైపు పరుగులు తీస్తుంది. కానీ, వేలాది సంవత్సరాలుగా డబ్బుగా చెలామణి అయినవి నాణెలు మాత్రమే.  లోహంతో తయారు చేయబడి  చెలామణిలో ఉన్న నాణెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే  కాగితం కరెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నాణెల ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ప్రపంచంలో అరుదైన నాణెలుగా రికార్డు సృష్టించిన నాణెలు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. మరి వాటి వివరాలు ఎంటో చూద్దామా..


6. లిబర్టీ హెడ్ నికెల్
మోర్టన్ స్మిత్ ఎలియాష్ బర్గ్ (1913 )

ఖరీదు 4.5మిలియన్ డాలర్లు (33,33,96,675  రూపాయలు) ఈ నాణెం ఖరీదు 2018లో వేలం ద్వారా 4,560000 డాలర్లకు చేరుకుంది. అత్యంత ప్రసిద్ధ చెందిన ఈ నాణెం ఈ భూగ్రహం మీద ఉనికిలో ఉన్న నాణెం ఐదు నమూనాలలో ఇది ఒకటి. వేలంపాటతో ధర పెరుగుతూ వచ్చి 2018లో 4.5మిలియన్ డాలర్లకు మించి ధర పలికింది. ఈ నాణెం పై భాగం నునుపుగా అద్దం వలే కనిపిస్తుంది. ఇలాంటి ఫినిషింగ్ ఉన్న నాణెం అరుదుగా ఉంటుంది. దీని  విలువ  ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాదు ఈ నాణెం ముద్రణ గురించి  అధికారిక రికార్డులు లేనందున ఇది ఏ కాలం నాటిది అన్న విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి.  కేవలం ఐదు లిబర్టీ నికెల్ నాణాలు మాత్రమే లభించాయి.  ఇవన్నీ అనధికారంగా తయారుచేశారంటారు. అయితే 1913 లో లిబర్టీ నికెల్ నాణెలను తయారు చేయడానికి  చట్టం అనుమతించింది. కాని కొంతమంది  మింట్ ఉద్యోగులు కొన్ని అక్రమ నమూనాలను ముద్రించారన్న ఆరోపణ ఉంది. ఈ ప్రసిద్ధ నాణెం 1972 నుండి రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 100,000 కు అమ్ముడైన మొదటి నాణెం ఇదే. ఆ తర్వాత 1996 లో దీని ధర  ఒక మిలియన్ డాలర్లు పలికింది.  ప్రస్తుత రికార్డ్ హోల్డర్ ఎలియాస్‌బర్గ్ స్పెసిమెన్, గ్రేడెడ్ పిసిజిఎస్ పిఎఫ్ 66.  ఇది 2018 లో  4.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది.

5.ఎడ్వర్డ్ 111 ఫ్లోరిన్ (1343)
ఖరీదు 6.8 మిలియన్ డాలర్లు(50,37,99,420 రూపాయలు)

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో ఇది ఒకటి. అంతేకాదు చాలా పురాతనమైన నాణెం.  దాదాపు 670ఏండ్ల చరిత్ర ఉంది. ఈ నాణెం విలువ ఎక్కువగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఇది అతి పురాతన నాణెం కావడం. ఒకే విధమైన నాణాల్లో మూడు మాత్రమే అనేక శతాబ్దాల నుంచి చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంటే ఇది చాలా విలువైనది మాత్రమే కాదు, అరుదైనది కూడా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నాణెలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.  ఈ నాణెం 2006 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరంలో వేలంపాట ద్వారా దీన్ని విక్రయించారు. ఆ తర్వాత 1857 లో టైన్ నదిలో కనుగొనబడిన మిగిలిన రెండు నాణేలు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

4.బ్రషర్ డబులూన్ (1787)
ఖరీదు 7.4 మిలియన్లు(54,82,50,830 రూపాయలు)

న్యూయార్క్ రాష్ట్రంలో నాణాల తయారిలో బంగారం బదులు రాగిని ఉపయోగించాలన్న బ్రషర్ లక్ష్యం  మేరకు రూపుదిద్దుకున్న నాణెలు. అయితే బంగారానికి బదులుగా రాగి నాణెలు తయారుచేయాలన్న ఎఫ్రియం బ్రషర్ల ప్రతిపాదనను ఆ రాష్ట్రం ఒప్పుకోలేదు. బంగారు నాణెలనే చెలామణిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే  బ్రషర్ ప్రతిభావంతుడైన స్వర్ణకారుడు. అతను స్టేట్ చేసిన సూచనను
విస్మరిస్తూ కొత్త నాణెలను ముద్రించాడు. వాటిలో ఎక్కువ భాగం కాంస్యంతో తయారు చేయబడ్డాయి. వాటిలో కొన్ని 22 క్యారెట్ల బంగారంతో కూడా తయారుచేశాడు. ఈ నాణెలు చాలా అరుదుగా లభిస్తాయి. అంతేకాదు ఆసక్తి గల  కథ వీటిపై ఉంటుంది. కాబట్టి, అవి చాలా విలువైనవి.  ఒక వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 2011 లో  వేలంలో 7.4 మిలియన్ డాలర్లకు ఒక నాణెం కొనుగోలు చేసింది.

3.సెయింట్ గౌడెన్స్ బబుల్ ఈగిల్ (1907)
ఖరీదు 7.6 మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు)

ఈ నాణాలను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం అనుకున్న దానికన్నా చాలా కష్టమని తేలింది. సంక్లిష్టమైన రూపకల్పన కారణంగా  వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.  ఆ తర్వాత కొన్ని మార్పు చేశారు. యు.ఎస్. మింట్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించే చార్లెస్ బార్బర్ ఈ నాణెం పై దేవుడిని మేం విశ్వసిస్తున్నాం అన్న పదాలను తొలగించాడు. నాణెం మార్పులో,  తయారీ బాధ్యత పూర్తిగా అతనే తీసుకున్నాడు.  కానీ దీన్ని సమావేశంలో అంగీకరించలేదు. అయినప్పటికీ నాాణెం తయారీ మాత్రం ఆగలేదు.  ఇప్పుడు అది అత్యంత విలువైన నాణెంగా రికార్డు నెలకొల్పింది.

2. డబుల్ ఈగల్ (1933)
ఖరీదు 7.6మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు)

డబుల్ ఈగిల్ 1933 అనేది యునైటెడ్ స్టేట్స్ 20 డాలర్ల బంగారు నాణెం. ఈ నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అప్పటివరకు సాధారణ ప్రజల మధ్య వాడకంలో ఉన్న ఈ నాణెలు కరిగించబడ్డాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడైన థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రజలు బంగారం కలిగి ఉండకుండా ఈ నాణాలను నిషేధించాడు. ఆ సమయంలో నెలకొనిఉన్న బ్యాంకింగ్ సంక్షోభానికి ఇది సహాయపడుతుందని అతను భావించాడు.  అయితే  కొద్ది మొత్తంలో ఈ నాణాలు ముద్రణాలయం నుంచి బయటకు వచ్చాయి.  ఏలా వచ్చాయి అన్నది మాత్రం స్పష్టం తెలియదు. కానీ, ఈ నాణాలను కలిగి ఉండటం అనేది చట్టవిరుద్ధం. ఎవరితోనైనా ఈ నాణెం ఉందని తెలస్తే దాన్ని వెంటనే స్వాధీనం చేసుకునేవారు. కానీ, ఎక్కడ నాణెలు ఉన్నాయి అన్నది తెలుసుకునే లోగానే ఇది ఒక కాయిన్స్ కలెక్టర్ వద్దకు చెేరింది. అవుతుంది. ఏదేమైనా, ఒక ప్రైవేట్ యజమాని ఒక నాణెం పొందగలిగాడు. ఇది మొదట ఈజిప్ట్ రాజు ఫరూక్ దగ్గర ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తి దీన్ని పొందాడు. నాణెం  విక్రయించి లాభాలను యుఎస్ మింట్ కు తో విభజించాడు. ఏదీ ఏమైనా 4,455.,000 నాణెలు ముద్రించబడినప్పటికీ ఏదీ అధికారిక నాణెంగా వాడుకల్లోకి రాలేదు.

1. ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్, కాపర్ డాలర్ (1794)
ఖరీదు 10 మిలియన్ డాలర్లు (74,21,43,500 రూపాయలు)

ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెం ఇది. పరిశోధకుల అంచనా ప్రకారం వెండితో తయారుచేయబడిన మొదటి నాణెం ఇది.  యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం చేత ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొదటి వెండి నాణెంగా గుర్తింపు పొందింది. అంతేకాదు  2013 లో ఈ నాణెం మరో రికార్డు సాధించింది. ఇది ఇప్పటివరకు అమ్మకానికి వచ్చిన అతి ఖరీదైన సింగిల్ కాయిన్ గా ప్రపంచ కొత్త రికార్డును సృష్టించింది. వెండి నాణేల ముద్రణకు వెళ్ళేముందు మింట్ 1792లో ముద్రణకు సంసిద్ధం అయ్యింది.  రాగి, వెండి నమూనా నాణేలను మాత్రమే తయారు చేసింది. అయితే ఈ నాణాలను సేకరించేవారు ఈ చారిత్రాత్మక,  అత్యంత విలువైన నాణెంను 200 సంవత్సరాలకు పైగా సంరక్షించారు. నాణేల ముద్రణ వెనుక ఉన్న కథ దాని విలువను పెంచుతుంది. చాలా సార్లు అంతకన్నా ఎక్కువే ఉంటుంది.