ఎపిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 6గురు మృతి
Published on: Thu Mar 6, 2025 10:31AM
ఎపిలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు.
ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీనీ ప్రయివేటు ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. వీరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు హైద్రాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదానికి గురైంది.
ఇదిలావుండగా వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్ది మడుగు ఘాట్ రోడ్డుపై బస్సు లోయలో పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. చేపల మేత లోడ్ తో బెంగుళూరు నుంచి ఏలూరు వెళుతున్న లారీ అదుపు తప్పి లోయలో పడిపోయింది.


