తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం...

posted on: Oct 15, 2019 3:18PM

 

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో వాల్మీకి కొండ వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాదు నుంచి భద్రాచలం మీదుగా వాళ్ళందరూ కూడా మారేడుమిల్లి విహార యాత్రకు వెళ్తున్నారు. విహారయాత్రకు వెళ్తుండగా చింతూరు దగ్గర నుంచి ఘాట్ రోడ్ లో వస్తూ మలుపు తిప్పుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం జరిగింది.

లోయలో పడిపోయిన ఘటనలో ఇప్పటివరకూ ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు మరియు ఇరవై మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్ళందరినీ కూడా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా బస్సులో ఎవరైనా ఉన్నారా అనేది వివరాలు తెలియాల్సి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఘటనా స్థలానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. రంపచోడవరం నుంచి ఘటనా స్థలానికి చేరుకోవటానికి మొత్తం సుమారు గంటన్నర సమయం పట్టవచ్చు, అయితే ఐటిడీఐ వారందరూ కూడా అడ్డతీగల ప్రాంతంలో ఈరోజు రైతు భరోసా కార్యక్రమంలో ఉన్నారు.

స్థానిక ఎమ్మెల్యేతో పాటు వారందరూ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  బస్సుని బయటకి తీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఆ బస్సులో కాని బస్సు కింద గాని ఎవరైనా ఉన్నారా అని ప్రయాణికులు ఎంతమంది ప్రయాణించారు అనేది తెలియాల్సి ఉంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...