కారులో 5 కోట్లు

posted on: Dec 4, 2018 9:32AM

 

ఎన్నికల వేళ పోలీసులు తనికీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా డబ్బు కనపడితే స్వాదీనం చేసుకుంటున్నారు. తాజాగా  ఈ తనిఖీల్లో భాగంగా వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై జనగామ జిల్లా పెంబ‌ర్తి చెక్‌పోస్టు వద్ద రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్టు కారును పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో కారు వెనుక సీటు కింద దాచిన నగదు కట్టలను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్టేషన్ లో ఎన్నికల అధికారుల సమక్షంలో పోలీసులు వాటిని లెక్కించారు. లెక్కించగా పట్టుపడిన మొత్తం డబ్బురూ.5 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...