చరిత్రలో ఇదే తొలిసారి, శ్రీధర్ ఇష్యూ నో

 

 

 

ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యంతర భృతిపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి అంగీకరించమని, 2014 జనవరి ఒకటి నుంచి ఐఆర్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.


ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఉద్యమాల వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గడానికి కారణమయ్యాయని అన్నారు.  ఒకటి, రెండు రోజుల్లో హెల్త్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.వాణిజ్యపన్నుల శాఖను స్వీకరించబోనన్న శ్రీధర్‌బాబు ప్రకటనపై స్పందించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.