TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

25 కోట్ల దోపిడీ

Published on: Thu Apr 2, 2015 4:35PM

 

25 కోట్ల రూపాయల విలువైన దొంగతనం ఢిల్లీలో జరిగింది. 25 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల ట్రక్కును దోపిడీ దొంగలు ఎత్తుకుని వెళ్ళారని ఆగ్నేయ ఢిల్లీ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వైపు వెళ్తున్న ట్రక్కును దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారి ఒకరు తెలియజేస్తూ, ‘‘నోయిడా వెళ్తున్న ట్రక్కునుకాళిందికుంజ్ ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు ఆపారు. ట్రక్కు డ్రైవర్ని, అతని సహాయకుడిని బెదిరించి ఎలక్ట్రానిక్ వస్తువులతో వున్న ట్రక్కును దారి మళ్ళించి తీసుకుని వెళ్ళారు. దొంగలు లారీ నుంచి జీపీఎస్‌ను తొలగించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి’’ అన్నారు.