శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Fri May 12, 2023 7:16AM
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది.
ఇక నిన్న అంటే గురువారం(మే11) స్వామివారిని 67, 853 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలుగా ఉంది. 33 వేల 381 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు.


