Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
posted on: Dec 1, 2018 1:24PM

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ లో అందించే అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓపితో పాటు ఐపీ సేవలనూ నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 1200 కోట్లు విడుదలలో జాప్యం వల్లే డిసెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం గురువారం రూ. 150 కోట్లు విడుదల చేసినా అసోసియేషన్ దిగిరాలేదు. దీనికి ఆరోగ్యశ్రీ సీఈఓ వైఖరి కూడా కారణమని తెలుస్తోంది. నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులను కలిసేందుకు ఆయన విముఖుత చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతతో.. ఆపరేషన్లు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లోని ఎమర్జెన్సీ కేసులను ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. మరి పేదవాడి ఆరోగ్యానికి వరంలాంటి ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.






