రాజమండ్రి కాలేజీలో 175మందికి కరోనా

posted on: Mar 24, 2021 5:59PM

అది రాజమండ్రిలోని తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌. అందులో కరోనా కలకలం. కాలేజ్ హాస్టల్‌ను కొవిడ్ మహమ్మారి కమ్మేసింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఒకే కాలంలో ఏకంగా 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాలేజ్‌ హాస్టల్లోనే ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

కొవిడ్‌ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి మూడోవారం నుంచి కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొవిడ్‌పై సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కరోనా వస్తుండటం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్‌ కేసుల భారీగా పెరగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మాస్క్‌ ఉంటేనే పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాజమండ్రిలోని జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 175మందికి కొవిడ్ పాజిటివ్ రావడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది. రాజమండ్రి ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...