Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి
posted on: Oct 25, 2014 5:48PM

చైనాలో ఓ బొగ్గుగనిలో ప్రమాదం సంభవించి 16 మంది గని కార్మికులు మరణించారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారు. జిన్ జియాంగ్‌లోని టైచాంగౌలో ఓ బొగ్గు గనిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. బొగ్గు పెళ్ళలు కుప్పకూలిపోవడంతో కార్మికులు అందులో ఇరుక్కుపోయి మరణించారు. చైనాలోని బొగ్గు గనులు అత్యంత ప్రమాదకరమైనవని అంటారు. గతంలో చైనాలోని బొగ్గు గనులలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతూ వుండేవి. అయితే ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటించడం వల్ల ఇటీవలి కాలంలో గనుల్లో ప్రమాదాలు తగ్గాయి. అయితే అనూహ్యంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాదం జరిగింది.






