కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసులు మృతి

posted on: Oct 26, 2023 11:16AM

కర్నాటకలో గురువారం (అక్టోబర్ 26) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాకు చెందిన వారేనని అంటున్నారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. తిరమల శ్రీవారిని దర్శించుకుని మహానంది క్షేత్రానికి వెడుతుండగా చిక్కబళ్లాపైర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటన జరిగిన సమయంలో వాహనంలో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...