Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబులెన్సులో ఆవులు- అక్రమంగా తరలిస్తుండగా సజీవదహనం
posted on: May 1, 2022 1:51PM
అంబులెన్స్ లో అక్రమంగా ఆవుల తరలింపు వ్యవహారం ఒక ప్రమాదం వల్ల బయటపడింది. అయితే ఆ ప్రమాదంలో ఆవులు సజీవదహనమయ్యాయి. రోగులను ఆసుపత్రులకు తీసుకు వెళ్లాల్సిన అంబులెన్సులో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు.
అయితే ఆవులను తరలిస్తున్న అంబులెన్స్ కు మంటలు అంటుకుని ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో లో జరిగింది. అంబులెన్స్ లో ఆవులను నిర్మల్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఇందల్వాయి వద్ద వాహనంలోని సిలిండర్ పేలి ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్ అంబులెన్స్ ను రోడ్డు మీదే ఆపేసి పరారయ్యాడు.
అంబులెన్స్ లో ఉన్న 13 ఆవులు సజీవ దహనం అయ్యాయి. ఆవుల అక్రమ రవాణా వెనుక ఉన్నది ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆవుల సజీవ దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్రమ రవాణాదారులు పాల్పడిన గో హత్యగా ఈ సంఘటనను పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


.webp)



