TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెన్త్‌ పరీక్షా ఫలితాలలో బాలికలదే పై చేయి

Published on: Thu May 24, 2012 1:53PM

టెన్త్‌ పరీక్షా ఫలితాలలో కూడా బాలికలదే హవా కొనసాగింది. బాలుర కన్నా బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి మాణిక్యవర ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బాలికలు 88.76 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 86.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 87.84 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.


 

ఫలితాల్లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా హైదరాబాదు చివరి స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో 93.38 శాతం మంది ఉత్తీర్ణలు కాగా, హైదరాబాదు జిల్లాలో 76.94 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 26వ తేదీ నుంచి జరుగుతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 17 పాఠశాలలు జీరో ఉత్తీర్ణతను సాధించాయి. అత్యధిక ఫలితాలు సాధించిన జిల్లాల్లో కడప రెండో స్థానంలో నిలువగా, నల్లగొండ మూడో స్థానంలో నిలిచింది.