Latest News
మహేష్ నిర్మాతలపై ఐటీ దాడులు...!
posted on: Jan 9, 2014 8:41AM

14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఇళ్ళపై ఒకేసారి బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ రైడ్ లో వారి దగ్గర నుంచి కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లుగా తెలిసింది. ఈ నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టార్ హీరోలతో సినిమాలు తీయడం వంటి ప్రధాన కారణాలుగానే ఈ రైడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వీరు నిర్మించిన "1" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అదే విధంగా మహేష్ తో "ఆగడు", బాలకృష్ణతో "లెజెండ్" చిత్రాలను నిర్మిస్తున్నారు.






