TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ఎవడు' సెన్సార్: పెద్దలకు మాత్రమే

Published on: Sat Jul 27, 2013 11:26AM

 

 

 Yevadu Censor, Ram Charan Yevadu Censor,  Yevadu Censor report

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ లేటెస్ట్ మూవీ 'ఎవడు' ఈ నెల 31 వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, శ్రుతి అందాలను ఎక్కువగా అరబోయడంతో సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీచేసారు.

 

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ స్పెషల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది.