పాలించే వాడికి  మెరిట్ ఉండాలి.. ఈటల మరో సంచలనం

posted on: Apr 2, 2021 9:26PM

ఇటీవల కాలంలో హాట్ కామెంట్స్ తో  హీట్ పుట్టిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో
ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలన్నారు. ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలని సూచించారు.. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలన్నారు ఈటల రాజేందర్. ‘‘నేను మంత్రి కావొచ్చు, కానీ ముందుగా మనిషిని. మెరిట్ లేనిదే టీచర్ కారు.మెరిట్ లేనిదే మెడికల్ సీటు రాదు. దేశ పౌరునిగా, సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సక్రమంగా అమలు కావడం లేదని ఈటల రాజేందర్  అన్నారు. 

అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదని, సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణమని మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. ఎలుకల బాధకు ఇంటిని తగలబెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక రోజు నీ గడప కూడా తొక్కుతుందని ఈటల హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...