Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణకోసం రాజీనామాలు చేస్తాం: టీ కాంగ్రెస్ ఎంపీలు
posted on: Jan 28, 2013 5:31PM
.jpg)
తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ ఎం.పి.లు నిర్ణయించుకున్నారు. వీరు పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఎం.పి.లు నిర్ణయం తీసుకున్నారు. ఈ లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధికే పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు.
పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు. టి.ఆర్.ఎస్. 2014 ఎన్నికలే లక్ష్యంగా మాట్లాడుతున్నదని, కాని తాము మాత్రం తెలంగాణ ను సాధించే దిశగా అధిష్ఠానాన్ని నిలదీస్తామన్నారు.


.jpg)



