సునీల్ 'యాక్షన్ త్రీడీ'
posted on Jun 1, 2013 6:49PM

అల్లరి నరేశ్ నటిస్తోన్న యాక్షన్ త్రీడీ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి పోస్టర్ల వరకూ అన్నీ వెరైటీగా డిజైన్ చేయడంతో సినిమా ఓ రేంజ్ లో ఉండొచ్చన్న ఆసక్తి పెరుగుతోంది జనాల్లో. ఈ ఆసక్తిని మరింత పెంచడానికి దర్శక నిర్మాతలు ఓ ప్రత్యేక పాత్రను సృష్టించారు. అందులో నటించాలంటూ సునీల్ ని అడిగారు. హీరో అవతారం ఎత్తాక సునీల్ చిన్న చిన్న పాత్రలు చేయడం మానేశాడు. అయినా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. దానికి కారణం అల్లరి నరేశ్. అతడితో సునీల్ కి మంచి స్నేహం ఉంది. అందుకే అతణ్ని ఒప్పించే పనిని నరేశ్ కే అప్పగించాడు దర్శకుడు. సునీల్ కూడా నరేశ్ మాట కాదనలేక వెంటనే సరే అన్నాడు. టాలీవుడ్ లో కాంపిటీషన్ చాలా హెల్దీగా ఉంటుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ!