ఈ ఏడాది చివరకల్లా రెండు రాష్ట్రాల ఏర్పాటు

posted on: Sep 6, 2013 7:16AM

 

ప్రత్యేక సమైక్య సెగలతో రాష్ట్రం తగలబడుతుంటే కేంద్ర మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో విభజన విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చిచెపుతుంది. 36 రోజులుగా సీమాంద్రలో భారీగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం విభజన దిశగా తన పని తాను చేసుకుపోతుంది.

ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లోనే విభజన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయితే రాష్ట్రపతి పాలన పెట్టి అయిన విభజన తంతును పూర్తి చేయనున్నారట.

ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్‌ నోట్‌ రూపకల్పన మొదలు పెట్టిన కేంద్ర హోంశాఖ. ఆ నోట్‌ కాపీని న్యాయశాఖకు పంపినట్టుగా సమాచారం. అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కూడా కేంద్రం తెరదించనుందట.

google-ad-img
    Related Sigment News
    • Loading...