Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అబ్బే అలా అనలేదు
posted on: Jul 22, 2013 12:03PM

మోడి ప్రదానమంత్రి అభ్యర్థిత్వానికి ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగుతున్నాయి.. గతంలో మోడి ప్రదాని అభ్యర్థిగా ప్రకటించినపుడు శివసేన వ్యతిరేఖించిందని వచ్చిన వార్తలను ఆ పార్టీ ఛీఫ్ ఉద్దవ్ థాక్రే ఖండిచారు.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిదని తాను అలా అనలేదన్నారు..
అంతేకాదు బీజేపి ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మోడిని నియమించినపుడు తాము ఆహ్వానించామని.. శుభాకాంక్షలు కూడా తెలియజేశామన్నారు థాక్రే.. ప్రస్థుతం దేశానికి సమర్ధుడైన నాయకుడు అవసరం అని అధికార కాంగ్రెస్‌లో అలాంటి నాయకులే లేరని ఎద్దేవ చేశారు..
ఇప్పటి వరకు బిజేపి ప్రదాని అభ్యర్థిని ప్రకటించలేదని మోడి అభ్యర్థిత్వం కేవలం మీడియా సృష్టే అన్న థాక్రే.. ఎన్‌డిఎ తమ అభ్యర్థిని ప్రకటించాకే తన పార్టీ వైఖరిని ప్రకటిస్తామన్నారు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్న ఉద్దవ్ థాక్రే.. ఎన్‌డిఏతోనే కలిసి కొనసాగుతామన్నారు..






