శంకర్రావు విడుదల: దామోదర రాజనరసింహ ఫైర్

 

 

Shankar Rao arrested, Ex Minister Shankar Rao Arrested, Ex Minister Shankar Rao released, Ex Minister Shankar Rao kiran kumar reddy

 

మాజీ మంత్రి శంకర్ రావు ను అరెస్ట్ చేసిన వైనం పై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు మాట మార్చారు. తాము శంకర్ రావు ను అరెస్ట్ చేయలేదని, విచారణ కోసమే తీసుకువచ్చామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్స్ కుంభకోణంలో శంకర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం ఆయనకు ఆరోగ్యం బాగా లేదంటే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు జరిపిన అనంతరం ఆయనను విడిచిపెట్టారు.


మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు ఓ అమానుష చర్యగా డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తుల అహంకారానికి ఇది నిదర్శమని ఆయన పేర్కొన్నారు. దళితులు ఈ చర్యనుఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దామోదర కోరారు. ఉప ముఖ్యమంత్రి నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించకుండా డిజిపిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారా?లేక ముఖ్యమంత్రి కిరణ్ నేతృత్వంలో జరిగిందని ఆక్షేపించారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu