TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘ఎర్ర’ దొంగలకి బుద్ధి రాలేదు

Published on: Mon Apr 13, 2015 5:14PM

 

మొన్నీమధ్యే 20 మంది ఎర్రచందనం దొంగలని పిట్టల్లా కాల్చి పారేసినా, మిగతా ఎర్రచందనం దొంగలకు బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూనే వున్నారు. కడప, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో పోలీసులు జరిపిన కూంబింగ్‌లో 134 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాలు, సెల్‌ఫోన్లు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారందరూ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందినవారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన కూలీలలో ఎక్కువమంది ఈ ప్రాంతానికి చెందినవారే.