హై కోర్టులో సత్యం కు ఊరట
Published on: Tue Dec 11, 2012 1:57PM
.jpg)
సత్యం కంపెనీకి రాష్ట్ర హై కోర్టులో ఊరట లభించింది. 822 కోట్ల రూపాయల కంపెనీ ఆస్తుల జప్తునకు సంభందించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులఫై హై కోర్టు స్టే విధించింది.
ఆస్తుల జప్తు ఫై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు రాష్ట్ర హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిఫై విచారణ జరిపిన హై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంభందించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత అక్టోబర్ 18 న ఆస్తుల జప్తు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు ప్రధాన నిందితునిగా ఉన్నారు. జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.


