TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఏం, గవర్నర్

Published on: Sat Aug 29, 2015 12:30PM

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఇరు రాష్ట్రాలోని మహిళల భద్రతకు రక్షాకవచంగా ఉంటానన్నారు.మహిళా మంత్రులు పరిటాల సునీత,పీతల సూజత,మృణాశిని,కృష్ణాజిల్లా జడ్పీచైర్మన్ గద్దె అనూరాధ,బ్రహ్మకుమారీలు,పలువురు మహిళలు చంద్రబాబుకు రాఖీ కట్టారు.

 

రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.పలువురు ప్రముఖులు,నేతలు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ నివాసంలో నిర్వహించిన రాఖీవేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్..కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రాఖీ కట్టి అశీర్వాదం తీసుకున్నారు.

 

రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.గవర్నర్ నరసింహన్‌కు స్కూల్ విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన సూచించారు.