రాహుల్ పిల్లచేష్టలు

 

 Rahul Speeches Miss the Whole Point, Rahul Speeches, Rahul Gandhi emotional speech

 

 

పిల్లచేష్టలు వదలిపోని నలభయ్యేళ్ళ రాహుల్‌గాంధీని వాళ్ళమ్మ సోనియమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి నానా తంటాలు పడుతూ, అడ్డగోలు విభజనకు కూడా పూనుకుంది. అమ్మ మనసుని అర్థం చేసుకుని హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్‌గాంధీ మాత్రం వీలైనప్పుడల్లా తన పిల్లచేష్టల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆమధ్య కేంద్రప్రభుత్వ నేరచరితుల ఆర్డినెన్స్ విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడి నాలుక్కరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా గొప్ప విషయంలా ఒప్పుకున్న నిర్ణయాన్ని ఒక్కమాటలో తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ పరువుని నడిరోడ్డు మీదకి ఈడ్చాడు. తలలు పండిన కాంగ్రెస్ నాయకులు కూడా తనముందు దిగదుడుపేనని తేల్చేశాడు.

 

 

రాహుల్‌గాంధీ పిల్లచేష్టల ధాటికి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు లోలోపల కుమిలిపోతున్నా, ఎందుకొచ్చిన గొడవ అని ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజాగా రాహుల్‌గాంధీ రాజస్థాన్ ఎలక్షన్ మీటింగ్‌లో తన ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం, లేనిపోని ఇష్యూ క్రియేట్ చేయడం రాహుల్ పిల్లచేష్టలకు పరాకాష్ట అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



ఓటర్లని ఆకర్షించడానికి ఎలాంటి మాటలు మాట్లాడొచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా రాహుల్‌గాంధీకి లేకపోవడం సహజమేనంటున్నారు. రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లు రాజస్థాన్‌లో ఓట్లు రాల్చే విషయం అటుంచి, జనాలకి రాహుల్ అంటే చిరాకుపుట్టి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఇప్పటికైనా పిల్లచేష్టలు మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు.